About

నా గురించి

నేను గోపికృష్ణ రెడ్డి గుజ్జుల. ప్రస్తుతం మెల్‌బోర్న్ వెస్ట్, ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాను. స్వస్థలం నంబూరు గ్రామం, గుంటూరు జిల్లా.

పుస్తకాలు చదవడం అంటే నాకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా తెలుగు పుస్తకాలు చదవడం, వాటి ద్వారా మన భాష, మన సంస్కృతి, మన ఆలోచనా విధానాన్ని మరింత దగ్గరగా తెలుసుకోవడం నాకు ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుంది.

కాలక్రమేణా నేను సమీకరించిన తెలుగు పుస్తకాలతో ఈ చిన్న వ్యక్తిగత లైబ్రరీ ఏర్పడింది. ఇక్కడ ప్రస్తుతం నా దగ్గర ఉన్న పుస్తకాల జాబితాను చూడవచ్చు. పుస్తకం గురించి తెలుసుకోవాలనుకున్నా, చదవడానికి తీసుకోవాలనుకున్నా లేదా మీ దగ్గర ఉన్న పుస్తకంతో అదలా బదలీ చేసుకోవాలనుకున్నా నన్ను సంప్రదించవచ్చు.

ఈ లైబ్రరీ ప్రధానంగా మెల్‌బోర్న్ మరియు పరిసర ప్రాంతాల్లోని తెలుగు పుస్తకప్రియుల కోసం. పుస్తకాలను ఒకరికొకరు పంచుకోవడం ద్వారా మన తెలుగు పఠన సంస్కృతిని మరింతగా పెంచుకోవచ్చని నా నమ్మకం.

అలాగే, పుస్తకాల గురించి మాట్లాడటం నాకు చాలా ఇష్టం. మీరు చదివిన మంచి పుస్తకం ఏదైనా ఉంటే చెప్పండి. నాకు నచ్చిన పుస్తకం గురించి మాట్లాడాలనుకున్నా, మీ అభిప్రాయం పంచుకోవాలనుకున్నా — ఎప్పుడూ స్వాగతమే.

Email: library@gopigujjula.com

YouTube: @GopiGujjulaThoughts

316+

పుస్తకాలు

8

వర్గాలు

201+

రచయితలు

2

భాషలు